Saturday, 29 December 2012
'ఆణిముత్యాలు' సాంప్రదాయ కవుల సాహితి మైత్రి!
'గుమ్మటాలు' పుస్తకం తర్వాత ఓంప్రకాష్ ప్రచురణాలయం ప్రచురణల బాద్యతను మా బాబాయి కృష్ణమూర్తి తీసుకున్నారు. 1978 లో 'పునీత చరితులు' పేరుతో ఓ పుస్తకం తెచ్చారు. ఆ తర్వాత తొమ్మిది ఏళ్ళకు వచ్చిన పుస్తకం 'ఆణిముత్యాలు'. శతాధిక సంప్రదాయ కవుల సాహితి మైత్రికి ఈ పుస్తకం దర్పణం పట్టింది. కవుల పద్యాలనూ, వారి పరిచయాలను ఈ పుస్తకంలో పొందుపరచడం విశేషం.
Friday, 28 December 2012
'Andhrula Poratam' by George Fernandes
1973 లో ఓంప్రకాష్ ప్రచురణాలయం ద్వారా వచ్చిన నాలుగవ పుస్తకం 'ఆంధ్రుల పోరాటం'. ప్రత్యేక ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాల ఆవశ్యకతను వివరిస్తూ అప్పటి భారత సోషలిస్ట్ పార్టీ అద్యక్షుడు జార్జ్ ఫెర్నాండేజ్ వెలుబుచ్చిన భావాలను పుస్తక రూపంలో మా నాన్న గారు తెచ్చారు. నాలుగు దశాబ్దాలు గడిచినా... నేటికీ అదే వాతావరణం వుంది.
తొలి పుస్తకం!
1968 'పుష్పాభిలాష' పుస్తక ప్రచురణ తో ఓంప్రకాష్ ప్రచురణాలయం ప్రస్థానం మొదలైంది. దీని తర్వాత మా నాన్నగారు (శ్రీ వడ్డీ చంద్ర శేఖర రావు) తన స్వీయ రచనతో 'నేతాజీ బోసు జీవితం' పుస్తకం తేవాలని అనుకున్నారు. అలానే మా బాబాయ్ విజయసారధి రచన 'వీరపధం' (ఖండ కావ్యం) ప్రచురించాలని అనుకున్నారు. ఈ రెండు పుస్తకాలూ ఎందుకో రాలేదు!
Subscribe to:
Posts (Atom)